మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్.. జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహణ

viswatelangana.com
కోరుట్ల నియోజకవర్గం పరిధిలోని జై బాపు.. జై భీమ్.. కార్యక్రమంలో భాగంగా కల్లూరు, సర్ఫరాజ్ పూర్ అలాగే మాధపూర్ గ్రామాలలో పార్టీ నాయకులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న కోరుట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ మహాత్మ గాంధీ వారసత్వాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరచడం అంటే యావత్ మన దేశాన్ని అవమానపరిచినట్లే అన్నారు.. బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ప్రజాసౌమ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతుందాన్నారు. ⁴ స్థాయి, బూత్ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గోని విజయవంతం చెయ్యాలని కోరారు..ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం వెంకటేష్, కిషన్ సేల్ అధ్యక్షుడు బొల్లె నర్సయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు మంథని గంగ నర్సయ్య, జనరల్ సెక్రటరీ రసూల్, మాజీ ఎంపిటిసి రమేష్, కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, మహేష్, అశోక్, మహేష్, గ్రామ శాఖ అధ్యక్షులు తోట నర్సయ్య, మాజీ జెడ్పిటిసి తోట గంగాధర్, మాజీ సర్పంచ్ మల్లన్న, తిరుపతి రెడ్డి, మాదాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం మల్లారెడ్డి, ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, ఎంపిటిసి వాడాల లచ్చన్న, మారంపల్లి భూమయ్య, రాజేష్, శంకర్ లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..



