మెట్ పల్లి
ఆత్మహత్యలపై అవగాహన కార్యక్రమం

viswatelangana.com
September 18th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి లో ప్రిన్సిపాల్ ఆర్ వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన విద్యార్థుల ఆత్మహత్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ‘స్టూడెంట్స్ కౌన్సిలర్’వి నర్సయ్య విద్యార్థులకు ఆత్మహత్యలపై పలు సూచనలు చేశారు అలాగే ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ మరియు మోటివేటర్ నవీన్ కుమార్ పుప్పాల మాట్లాడుతూ విద్యార్థులు మంచి లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యం వైపు వెళ్లాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆత్మహత్యల జోలికి వెళ్లకూడదని ఏమైనా ఇబ్బందులు ఉంటే తల్లిదండ్రులకు గాని మాకు గాని చెప్పాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సిహెచ్ శ్రీనివాస్, బి శ్రీనివాస్. జగపతి, కిరణ్ కుమార్, మహేశ్వరి, ప్రతిభ. మంజుల, వెంకటేష్, సుదర్శన్, రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు



