కొడిమ్యాల

ఎమ్మార్పీఎస్ దళిత సంఘాలు నిరసన

viswatelangana.com

March 8th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సారంగాపూర్ మండలంలోని నాగునూరు గ్రామంలో భారతరత్న రాజ్యాంగ గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్, విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేయడాన్ని నిరసిస్తూ జేఏసీ, ఎమ్మార్పీఎస్,దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపి పాలాభిషేకం ,పూలదండ వేసి అనంతరం ఎమ్మార్వీఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి రక్షణ లేనప్పుడు దళితులకు ఎలా రక్షణ ఉంటుందని వారు వాపోయారు రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాలను, దళితులను రక్షించడంలో పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు వెంటనే దుండగులను కఠినంగా శిక్షించాలని లేని యెడల పెద్ద ఎత్తున అందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలొ మాదిగ జేఏసీ చైర్మన్ పర్లపల్లి ప్రసాద్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు బండారి నరేష్ దోమకొండ నర్సయ సురుగు శ్రీనివాస్ నేరెళ్ల మహేష్ కొత్తూరి స్వామి ఎలగుర్తి రవీందర్ రామంచ లక్ష్మణ్ పర్లపల్లి ఆనందం మర్లపల్లి ప్రభుదాస్ దుబ్బాక అరుణ్ రాజ్ కులపురి రమేష్ పడిగల దేవయ్య మహంకాళి గంగయ్య తాండ్రాల భీమయ్య లింగంపల్లి శంకర్ తాండ్రాల శంకురాజు ఎలగుర్తి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button