రాయికల్

ప్రభుత్వానికి ప్రజలకు వారధి పాత్రికేయులు

:జిల్లా పరిషత్ తాజా మాజీ చైర్ పర్సన్ వసంత

viswatelangana.com

January 28th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పాత్రికేయులు నిలుస్తున్నారని జిల్లా పరిషత్ తాజా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. రాయికల్ మండల ప్రెస్ క్లబ్ జేఏసీ నూతన పాలకవర్గ కమిటీ సభ్యులను మంగళవారం తాను కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నది కేవలం పాత్రికేయులేనని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న పాత్రికేయులు అందరికీ ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమం చేయడానికి తమ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని, పాత్రికేయులు సహకారం అందివ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రాయికల్ ప్రెస్ క్లబ్ జెఎసి అధ్యక్షులు వాసరీ రవి ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, కోశాధికారి మచ్చ శేఖర్, ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్, సంయుక్త కార్యదర్శి గంగదరి సురేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సింగిడి శంకరయ్య, సీనియర్ పాత్రికేయులు సయ్యద్ రసూల్, ఏనుగంటి రవి, వాసం లింబాధ్రి, అణుపురం లింబాధ్రి గౌడ్, పాత్రికేయులు మాణిక్యం గంగాధర్, గట్టిపెల్లి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button