రాయికల్
మతి స్థిమితం సరిగా లేక వృద్ధురాలు మృతి

viswatelangana.com
May 9th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లో మతిస్థిమితం సరిగా లేక వృద్ధురాలు మృతి. మృతురాలు మామిడి రాజు భాయ్ కు గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక ఈనెల 5వ తేదీన కుటుంబ సభ్యులకు తెలవకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది. మనుమడు మామిడి సంజీవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఈరోజు రాయికల్ గ్రామ శివారున గల వ్యవసాయ బావిలో పడి చనిపోయి ఉండగా, మతిస్థిమితం సరిగా లేనందున ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయి ఉండవచ్చునని కుటుంబ సభ్యులు తెలుపగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



