రాయికల్
మత్తుమందు చల్లి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు

viswatelangana.com
July 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి వృద్ధురాలిపై మత్తుమందు తల్లి ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన సంఘటన రాయికల్ పట్టణంలో జరిగింది. స్థానికుల కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయికల్ పట్టణంలోని కేశవ నగర్ కు చెందిన వెల్మ రాధమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాధమ్మపై మత్తుమందు చెల్లి ఆమె ఒంటి పై ఉన్న బంగారు కడియం, గొలుసు ఎత్తుకెళ్లినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



