మత్తు లో యువత జీవితం చిత్తు

viswatelangana.com
నేడు ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవర పేడుతున్న భయంకరమైన సమస్యలలో మాదకద్రవ్యాల తయారీ అక్రమ రవాణా వినియోగం అత్యంత ముఖ్యమైనది, వీటిని అరికట్టడానికి చాలా దేశాలు కఠిన చట్టాలను, శిక్షలను సైతం అమలు చేస్తూ ఈ సమస్యను యుద్ధంతో సమానమైన తీవ్రతగా పరిగణిస్తున్నాయి. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (పౌర మరియు మానవ హక్కుల సంస్థ ) డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ తాలూకా మల్లేష్ మాట్లాడుతూ. విద్యార్థులు అలాగే యువత సన్మార్గంలో నడవాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అలాగే ఈమధ్య కొన్ని కోట్ల మంది డ్రగ్స్ బారిన పడి, దానికి బానిసలా మారుతూ ఈ వ్యసనాల బారి నుంచి బయటపడలేక సతమతమవుతున్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసుకుని విలువైన జీవితం నాశనం చేసుకుంటున్నారు. యువతను పట్టిపీడిస్తున్న ఈ మత్తు పదార్థాలపై ప్రభుత్వం మరియు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అలాగే కుటుంబ సభ్యుల సహకారం మరియు ఉపాధ్యాయుల సహకారం తప్పనిసరి అని ఆయన తెలిపారు..



