కోరుట్ల
గాంధీ జయంతి వేడుకలు

viswatelangana.com
October 2nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము, కోరుట్ల నందు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావు, మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీ పన్నాల అంజిరెడ్డి లు పూలమాల వేసి వారిని స్మరించుకొని బాపూజీ సేవలను కొనియాడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమములో వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్ గౌడ్ మరియు పాలకవర్గ సభ్యులు శ్రీరాముల అమరెందర్, పల్లపు రాజు, పోతుగంటి వెంక గౌడ్, దోడ బాపురెడ్డి, జక్కుల రాజం, అబ్దుల్ వాసిద్, మోహ్డ్ అయ్యుబ్ మరియు కాంగ్రెస్ నాయకులు దోడ రంజిత్, ఆడెపు మధు, బెజ్జారపు శ్రీనివాస్, ఆవునూరి కాశిరెడ్డి, పల్లపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.



