కథలాపూర్

మోడల్ స్కూల్ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ మరియు పెన్నుల పంపిణీ

viswatelangana.com

March 14th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణంలో కందరి కిషన్ రెడ్డి ఏనుగు గంగా రెడ్డి ఈనెల 18 తారీఖున జరగబోయే ఎస్ఎస్సి బోర్డ్ పరీక్షలు రాయడానికి సిద్ధమైన విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది కిషన్ రెడ్డి మాట్లాడుతూ. ఒకటవ తరగతి నుండి పడితే పదవ తరగతి వరకు చదివిన చదువుకు పై చదువుల కొరకు పునాది వేయడానికి మీ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవడానికి నేను ఇచ్చిన కలంను పూర్తిస్థాయిలో మీ జీవిత భవిష్యత్తును మలుపు కోవడానికి సూచన నేను ఇచ్చిన ప్యాడు ను మీరు రాసే పరీక్ష పత్రం క్రింద ఒత్తి పెట్టుకొని రాస్తే మీ భవిష్యత్తును కూడా అంత ఒత్తుకొని కష్టపడితే పైకి లేస్తారు అని అన్నారు. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నరేష్. ఉపాధ్యాయులు గంగ నరసయ్య బాలేశం యాదగిరి పూర్ణచంద్ర రావు శారదా. శైలజ. విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button