కోరుట్ల

మల్లాపూర్ టూ హైదరాబాద్ బస్సు వెయ్యాలని మంత్రి ని కోరిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

June 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రం నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు బస్సు నడిపించాల్సిందిగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు శుక్రవారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో కలిసి విజ్ఞప్తి చేసారు. మండల కేంద్రమైన మల్లాపూర్ నుండి గొర్రెపల్లి, రేగుంట, సాతారం, ధర్మారం, ఐలాపూర్, కోరుట్ల మీదుగా హైదరాబాద్ వరకు బస్సు నడిపించడం వల్ల ఈ ప్రాంతంలో నుండి హైదరాబాద్ లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగులు ఇతరత్ర అవసరాల కోసం రాజధాని వెళ్లే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఇందుకుగాను మంత్రి ప్రభాకర్ సానుకూలంగా స్పందించారని జువ్వాడి కృష్ణారావు చెప్పారు.

Related Articles

Back to top button