viswatelangana.com
Date of Publish : 15 April 2025, 1:28 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కృష్ణారావు

కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమళ్ళ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆసిరెడ్డి రాజేశం, రంజిత్ రెడ్డి, కాశిరెడ్డి, జనార్ధన్, విడిసి సభ్యులు ఆయా కుల సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు ఉన్నారు.

Change News Type