ఘనంగా బతుకమ్మ వేడుక

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట్ గ్రామంలో సోమవారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా తాజా మాజీ సర్పంచ్ ఎంజి రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరగాయని. భూస్వాముల వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆమెను కలకాలం జీవించమని ఆశీర్వదించారు. అప్పటి నుండి బతుకమ్మ ఆడపిల్లను కీర్తించి పూజించడం ద్వారా మహిళల పండుగగా ప్రాచుర్యం పొందింది మరియు బతుకమ్మ వేడుకలో మహిళలందరూ తమకు ఎదురయ్యే ప్రమాదాల గురించి తెలుసుకుంటారు. గర్వం రావొద్దని, భర్తకు, పిల్లలకు హాని చేయవద్దని వేడుకుంటామని తెలియజేశారు. తాజా మాజీ ఉప సర్పంచ్ బత్తుల అశోక్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడబిడ్డలు ఎంతో భక్తిశ్రద్ధలతోg ఒక్కటే అనే భావనతో జీవించాలని అన్నారు.



