జగిత్యాల
మస్కట్-దుబాయి సరిహద్దుల్లో తప్పిపోయిన జగిత్యాల వాసి

viswatelangana.com
June 28th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన వడ్లకొండ మల్లేష్ వారం క్రితం ఓమాన్ – యూఏఈ (మస్కట్ – దుబాయి) దేశాల సరిహద్దులో తప్పిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని శుక్రవారం కలిసి సహాయాన్ని కోరారు. ఈ మేరకు స్పందించిన జీవన్ రెడ్డి మస్కట్, దుబాయి లలోని భారత రాయబారులకు, కేంద్ర విదేశాంగ మంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.



