కరీంనగర్
కరీంనగర్ లో ఎంపీ గా గెలుస్తున్నా -బండి సంజయ్ కుమార్

viswatelangana.com
May 15th, 2024
కరీంనగర్ (విశ్వతెలంగాణ) :
కరీంనగర్ లో తన గెలుపు ఖాయమని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ 10 నుంచి 12 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రావని ఈ రెండు పార్టీలు ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంటాయన్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఓట్ల రూపంలో చూపారని విమర్శించారు.



