మేడిపల్లి

మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలెంటరులు

viswatelangana.com

March 8th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల జగిత్యాల ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో రెండవ రోజులో భాగంగా ఉదయం స్థానిక పోరుమల్ల గ్రామంలో గల ఓంకారేశ్వర ఆలయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తదుపరి మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ పిఓ పదాల తిరుపతి రెడ్డి గారు పాల్గొని ఎన్ఎస్ఎస్ లో వాలెంటర్ల యొక్క పాత్రని సమాజంలో వాలంటీర్ల యొక్క పాత్రను వారి జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలను గుర్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోరు మల్ల మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి గుండ్లపల్లి మాజీ సర్పంచ్ సంపత్, మాజీ సింగిల్ విండో చైర్మన్ భూమా రెడ్డి వివిధ సంఘ నేతలు కళాశాల అడ్మిన్ స్టాఫ్ కే భూమ రాజం, లైఫ్ సైన్స్ అధ్యాపకురాలు మానస కెమిస్ట్రీ అధ్యాపకుడు ఎస్ రఘునాథ్ ఎన్ఎస్ఎస్ పి ఓ లు జి రాకేష్ ఎండి అప్సర్ వాలంటీర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Articles

Back to top button