రాయికల్

భూపతిపూర్ లో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

viswatelangana.com

May 2nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ జగిత్యాల ఆధ్వర్యంలో  ఉచిత వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరంను గురువారం రోజున భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి,రవిష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వీరు మాట్లాడుతూ విద్యార్థులు వేసవిలో చెడు తిరుగులకు అలవాటు పడకుండా, క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం, పొందుతారని అన్నారు. ఇట్టి శిక్షణ ఈరోజు నుండి నెల రోజులు నిర్వహిస్తారని తెలిపారు. శిక్షణలో పాల్గొన్నవారు ఐదవ తరగతి నుండి డిగ్రీ చదివే విద్యార్థులు అర్హులని తెలిపారు. రాయికల్ మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు యువత ఈ సమ్మర్ క్యాంపులను సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. క్రీడలను ప్రోత్సహించటంలో ముందుండే విజేత యూత్ వారు క్రీడాకారులకు నెలరోజుల పాటు జరిగే వేసవి శిక్షణ శిబిరానికి రోజు సాయంత్రం ఇచ్చే స్నాక్స్ ని ఇవ్వనున్నట్లు విజేత స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ సోమ రమేష్ రెడ్డి తెలిపారు. క్రీడాకారులు ఈ శిబిరంలో మెలుకువలు నేర్చుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

Related Articles

Back to top button