మాజీ చైర్మన్ లక్షల్లో నిధులు దుర్వినియోగం చేశారంటూ ఫిర్యాదు

viswatelangana.com
కథలాపూర్ మండలంలోని సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశంలో నిధుల దుర్వినియోగంపై వివాదం చోటుచేసుకుంది. శనివారం నిర్వహించిన సమావేశానికి డైరెక్టర్లు, రైతులు హాజరవ్వగా చుక్క దేవ రాజం చైర్మన్ గా ఉన్న సమయంలో సంఘం నిధులతో నిర్మించిన గోదాం విషయంలో రూ.21లక్షలు, తక్కళ్లపెల్లి పెట్రోల్ బంక్ ఏర్పాటులో రూ.12 లక్షలు, తక్కళ్లపల్లిలో గోదాం వద్ద మట్టిపోసి పనుల్లో రూ.3.80లక్షలు దుర్వినియోగం చేసినట్లు డైరెక్టర్లు ఆరోపించారు. దీనిపై మాజీ చైర్మన్ దేవరాజం మాట్లాడుతూ సహకార సంఘం తీర్మానం మేరకే నిధులు వినియోగించామని తెలిపారు. సంఘం నిధులను దేవరాజం సొంతానికి వాడుకున్నట్లు డైరెక్టర్లు ఆరోపించారు. దేవరాజం నుంచి డబ్బులు రికవరీ చేయాలని వాదనకు దిగారు. నిధుల దుర్వినియోగం పై సీఈవో రాము సమాధానం చెప్పాలని డైరెక్టర్లు, రైతులు నిలదీశారు. అనంతరం జిల్లా సహకార అధికారి సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. చైర్మన్ కందరి జీవన్ రెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల నరేశ్, డైరెక్టర్లు నాంపెల్లి శ్రీధర్, చుక్క దేవ రాజం, గంగారెడ్డి, కిషన్ రెడ్డి, గంగనర్సయ్య, లత, చౌదరి, రైతులు పాల్గొ న్నారు.



