viswatelangana.com
Date of Publish : 19 February 2025, 9:35 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మానవ మనుగడకు సనాతన ధర్మమే ఆధారం

ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన సనాతన ధర్మమే మన మనుగడకు ఆధారమని శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో శ్రీ లింగ మహాపురాణ సప్తహం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శర్మగారు మాట్లాడుతూ వేద వ్యాస మహర్షి మానవజాతికి అందించిన జ్ఞాన గనులే అష్టాదశ మహా పురాణాలని అన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాచీన, ఆధునిక, ఇంకా కనుగొనబడని మరెన్నో విజ్ఞాన విషయాలన్నీ మన పురాణాల్లో, వేదాలలో దాగి ఉన్నాయి అన్నారు. అష్టాదశ మహా పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా రెండవ ప్రయత్నంగా ప్రస్తుతం శ్రీలింగ మహాపురాణం వింటున్నామని. ఈ పురాణంలో సృష్టికి మూలమైన, లయకారుడైన ఆ మహా శివుని గురించి, శివ లీలల గురించి సవివరంగా చెప్పబడిందన్నారు. జీవన గమనంలో మనకు ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనే శక్తినిచ్చి, శుభాలను అనుగ్రహించే శుభకరుడే ఆ శంభుడు, శివుడు అని మహేశ్వరి శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్ష కార్యదర్శులు మంచాల జగన్, బట్టు హరికృష్ణ పురాణ కమిటీ చైర్మన్ పడిగల శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మోటూరి రాజేంద్రప్రసాద్, నిర్వాహకులు శక్కరి వెంకటేశ్వర్, నీలి కాశీనాథ్, భోగ శ్రీధర్, మంచాల రాజలింగం, మర్రి శంకరయ్య, చలిగంటి వినోద్, రామారావు, అల్లాడి మహేష్, మోటూరి రమేష్, చక్కరి అశోక్, లింగ రాజు తదితరులు పాల్గొన్నారు.

Change News Type