viswatelangana.com
Date of Publish : 01 July 2025, 3:38 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మారుమూల ప్రాంతాలకు బ్యాంకు సేవలు చేరాలి

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జులై 01 నుండి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకింగ్ సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని, ప్రతి గ్రామానికి ఒక బ్యాంకు బాధ్యత వహిస్తుందని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఖాతాలు లేని వారికి జన్ ధన్ ఖాతాలు తెరిపించడం, ఖాతాలున్నా వినియోగంలో లేకపోతే ఈ కేవైసీ చేయించడం, పీఎంఎస్బివై, పీఎంజేజేబివై, రూపే కార్డు ఆక్టివేషన్, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, లాంటి బ్యాంకు పథకాలు ప్రజలు చేరవేయడమని, ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై ఫిర్యాదు కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1930 లో ఫిర్యాదు చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బ్యాంకు సిబ్బంది శ్రీధర్, సురేష్, వేణు, మల్లయ్య, మహేష్, ఎఫ్ ఎల్ సి మధుసూదన్, మేడిపల్లి సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు నాగేంద్రప్రసాద్, నవీన్, మహేష్, నాయకులు సురేష్ గౌడ్, సుదర్శన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type