కోరుట్ల

ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్

viswatelangana.com

June 23rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వర్షపు జల్లుల ప్రారంభం నుండే గ్రామ దేవతలను పూజించడంలో ప్రజలు ముందుంటారని అందులో భాగంగా మారెమ్మ తల్లి చల్లని దీవెనలతో ప్రజలను సుభిక్షంగా వుంచాలని కోరుతూ తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మారెమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని మాదిగ, మాల కుల సంఘాల ఆద్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు ఊరేగింపుగా బోనాలతో వెళ్లి మారెమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.ఈవేడుకల్లో పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ పూర్వీకుల నుండి ఆనవాయితీగా కొలుస్తున్న మారెమ్మ దేవత కోరిన కోరికలు తీర్చుడంలో ప్రసిద్ధిగాంచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ అధ్యక్షులు శనిగారపు రాజేష్, మోర్తాడ్ రాజశేఖర్, చిట్యాల ప్రభాకర్, చిట్యాల శ్రీనివాస్, చెట్పల్లి లక్ష్మణ్, కంబ నంది, పసుల కృష్ణ ప్రసాద్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button