కోరుట్ల
మహా శివునికి వైభవంగా అన్నపూజ

viswatelangana.com
August 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పాతబజార్ లోని శ్రీనగరేశ్వరేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా సోమవారం రోజు ఉదయం అర్చన, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి చౌదరి దివాకర్ శర్మ వైదిక నిర్వహణలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం శివునికి అన్నపూజ, హావనకార్యక్రమాన్ని నిర్వహించి, భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో అలయ అధ్యక్షులు కొత్త సురేష్, నూనె నవీన్, ర్యాగెల్లి రమణయ్య, కొత్త వాసు, కొత్త రాజేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



