జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసారు. మార్కెట్ కమిటీ చెర్మన్ గా ఐలాపూర్ గ్రామానికి చెందిన పన్నాల అంజిరెడ్డి, వైస్ చేర్మెన్ గా పుల్లూరి వెంకటేష్ గౌడ్ తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు లకు ఘన స్వాగతం పలికిన కోరుట్ల కాంగ్రెస్ శ్రేణులు… అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ… మార్కెట్ కమిటీ చైర్మెన్ ప్రమాణ స్వీకారం రోజు వర్షం కురవడం శుభపరిణామం అన్నారు. ఉప ప్రధాని అవుతాననుకుని కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు రైతుల దగ్గర ముక్కు పిండి వసూలు చేశారన్నారు. మిల్లర్ల దగ్గర బీఆర్ఎస్ నేతలు కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చెప్పారు. రైతు రుణమాఫీ చేసి నిజమైన ప్రజా పాలన చూపించింది కాంగ్రెస్ సర్కార్ అని అన్నారు. ఎమ్మెల్యే వివేక్ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిదంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ…. మార్కెట్ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని, మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని, నూతన పాలక వర్గానికి సూచించారు. అనంతరం నూతన చేర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పన్నాల అంజిరెడ్డి మాట్లాడుతూ… నా పై నమ్మకం ఉంచి నాకు చేర్మెన్ పదవి కట్టబెట్టిన నర్సింగ్ అన్నకి రుణ పడి ఉంటా అని, చిన్న వయస్సులో పెద్ద బాధ్యత అప్పగించిన నర్సింగ్ అన్నకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అని అయన అన్నారు. అలాగే పెద్దలు చెప్పిన విధంగా నిరంతరం రైతుల శ్రేయస్సు కొరకు పని చేస్తానని అన్నారు.