పశు వైద్య కళాశాలలో కిసాన్ మేళా

viswatelangana.com
కోరుట్ల పట్టణంలోని పీవీ నరసింహారావు పశువైద్య కళాశాలలో గిరిజన రైతుల శ్రేయస్సు కొరకు కిసాన్ మేళా కార్యక్రమాన్ని జాతీయ మాంస పరిశోధనా సంస్థ(NMRI) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించడం జరిగింది. రైతు సోదర సోదరీమణులకు,గ్రామీణులకు, పశుపోషణలో అదనపు ఆదాయానికి సంబంధించిన మెలకువలను నేర్పి, అలాగే వారి సందేహాలను నివృత్తి చేశారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం మరియు పశుపోషణకు సంబంధించిన వివిధ శాఖల నిపుణులు రూపొందించిన పరికరాలు మరియు ఉత్పత్తులను ఈ కార్యక్రమంలో ప్రదర్శించడం జరిగింది. రైతులకు ఉపయోగపడే ఖనిజలవణ మిశ్రమము, నట్టల మందు గోలీలు, కొన్ని మేలు రకం విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా NMRI సంచాలకులు డాక్టర్ బార్జుదే, పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ శరత్ చంద్ర, పరిశోధనా సంచాలకులు డాక్టర్ సిహెచ్ హరికృష్ణ, NMRI శాస్త్రవేత్త డాక్టర్ పి బసవా రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బి నరేష్, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎస్ ఎల్ మనోహర్ తదితరులు పాల్గొన్నారని కిసాన్ మేళాకు అధ్యక్షత వహించిన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ తెలిపారు.



