కోరుట్ల
ఎన్ టి ఆర్ కు భారత రత్న ఇవ్వాలని టిడిపి కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి మానుక ప్రవీణ్ డిమాండ్

viswatelangana.com
March 29th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం టిడిపి ఇంచార్జి మానుక ప్రవీణ్ పార్టీ జెండా ఎగురవేసిన అనంతరం మాట్లాడుతూ కీర్తి శేషులు ఎన్ టి ఆర్ కేవలం 9 నెలల్లో అధికారం చేపట్టి రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు, పక్కా ఇళ్ళు, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు లాంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చి అంతే కాకుండా సినీ రంగంలో విభిన్న పాత్రలు పోషించి తెలుగు జాతిని ఖ్యాతి ని ప్రపంచ వ్యాప్తం చేసిన ఎన్ టి ఆర్ కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.



