ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి షాహిద్ మహమ్మద్ షేక్ పిలుపు

viswatelangana.com
కోరుట్ల నియోజకవర్గ కేంద్రానికి ఎన్నికల ప్రచారం నిమిత్తము కోరుట్ల కు వస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని కోరుట్ల చిరు వ్యాపారుల సమైక్య అధ్యక్షుడు షాహిద్ మహమ్మద్ షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీల పథకం విజయవంతంగా ప్రారంభించడం జరిగింది అని చెప్పడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ప్రస్తుతం దేశంలో విష ప్రచారాలు చేస్తున్నారని ఈ ప్రచారాలను నమ్మకుండా కాంగ్రెస్ కు ఓటు వేసి కేంద్రంలో ప్రభుత్వం చేపట్టేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కష్టసుఖాలు తెలిసిన పార్టీ అని కుల మతాలకు అతీతంగా ఉంటూ ప్రజల యొక్క అభివృద్ధికి జీవన మనుగడకు ఎంతగానో కృషి చేస్తుందని వారు వ్యాఖ్యానించడం జరిగింది. అందుకని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల చిరు వ్యాపారస్తులు, మారు అనుమక్క, శ్రీను, బాలక్క, లక్ష్మణ్, లక్ష్మి, తదితరులు పాల్గొనడం జరిగింది.



