కోరుట్ల

ముఖ్యమంత్రి సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నరసింగ రావు

viswatelangana.com

April 27th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలో మే 1 న జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ వేదికను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నరసింగ రావుతో కలిసి, కాంగ్రస్ పార్టి జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వవిప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ పశు వైద్య కళాశాల సమీపంలోని జాతీయ రహదారి పక్కన సభా వేదిక ప్రదేశాన్ని పరిశీలించి వారు మాట్లాడతూ బహిరంగ సభ ఉదయం 11 గంటలకు ఉంటుందని నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల మండల నాయకులు పట్టణ నాయకులు కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ సెల్ నాయకులు, ఎస్ సి సెల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button