రాయికల్

ముగిసిన వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరం

viswatelangana.com

May 31st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో మే 1 నుండి మే 31 తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర క్రీడా మరియు యువజన క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నెల రోజులపాటు 14 సంవత్సరాల విద్యార్థినీ విద్యార్థులకు శిక్షణ నైపుణ్యాలు నేర్చుకోవడం జరిగింది. ఈ శిక్షణలో పాల్గొన్న క్రీడాకారులు గ్రామీణ స్థాయి,జిల్లా స్థాయి,రాష్ట్ర స్థాయి క్రీడారంగంలో ఉత్తమ క్రీడాకారులుగా పేరు ప్రతిష్టలు సాధించాలని మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు నాగరాజు విక్రమ్ రాము, నాగరాజు జయంత్, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button