కథలాపూర్

ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది

viswatelangana.com

February 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితునిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మా ప్రభుత్వం ప్రజల పాలనే ద్యేయంగా ఏర్పడిన ప్రభుత్వం అని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ కులస్తుల సమస్యల అమలు కోసం ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉందని అలాగే ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాయితీ నాగరాజు,పులి హరిప్రసాద్,కల్లెడ గంగాధర్, వెగ్యారపు శ్రీహరి, అల్లకొండ లింగం గౌడ్, గోపిడి ధనుంజయ రెడ్డి,తొట్ల అంజయ్య వెలిచాల సత్యనారాయణ,చెదలు సత్యనారాయణ, అల్లూరి దేవారెడ్డి,ముదాం శేఖర్,గడ్డం చిన్నారెడ్డి, వాకిటి రాజారెడ్డి, గడ్డం స్వామి రెడ్డి, కూన శ్రీనివాస్,ము దిరాజ్ సంఘం అధ్యక్షులు నర్సయ్య, దేశవేని రంజిత్, బోనాల నారాయణ,చెన్నవేని గంగాధర్, న్యావనంది శేఖర్, పొన్నం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button