వివిధ రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల లో బుధవారం రోజున ఉదయం 10:00 గం.లకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎన్.ఆనంద్ కుమార్ ఓటర్ సమాచార స్లిప్ ల పంపిణీ మరియు మొత్తము 262 పోలింగ్ స్టేషన్లు , 140 లోకేషన్స్ వివరములు మరియు 16 పోలింగ్ స్టేషన్ల లొకేషన్ ల మార్పు పై” రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశము నిర్వహించడము జరిగినది. ఈ సమావేశములో ఆయన మాట్లాడుతూ 20- కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ మాట్లాడుతూ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ పంపిణీ గురించి మరియు అసెంబ్లీ ఎన్నికలు 2023 సమయంలో ఓటర్లకు అసౌకర్యం కలిగిన కొన్ని పోలింగ్ స్టేషన్ల లొకేషన్ లను లోక్సభ-2024 సాధారణ ఎన్నికల దృష్ట్యా ఓటర్ల సౌకర్యార్థము మార్చిన దాని గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు.భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ఓటరు సమాచార స్లిప్ పంపిణీ నామినేషన్ల చివరి తేదీ (అంటే, 25.04. 2024) నుండి ఓటరు సమాచార స్లిప్ పంపిణీ ప్రారంభమవుతుందని. మరియు నమోదు చేసుకున్న ఓటర్లందరికీ పోల్ రోజుకు 5 స్పష్టమైన రోజుల ముందు (అంటే 08.05.2024) వరకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ల పంపిణీ చేయబడుతుందని తెలియజేశారు.అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల ఉద్దేశించి, ఓటరు సమాచార స్లిప్లను పంపిణీ చేయడానికి బి ఎల్ వో లు ఇంటింటికి పోయి పంపిణీ లని చేస్తారని చెప్పారు. 20- కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ లోని మొత్తము 262 పోలింగ్ స్టేషన్ల వివరములు మరియు మార్చబడిన (16) పోలింగ్ స్టేషన్ల లొకేషన్ వివరములు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడము జరిగినది.ఈ సమావేశములో రాజకీయ పార్టీ ప్రతినిధుల తరపున చెట్లపెల్లి సాగర్, శ్రీరాముల అమరేంధర్, అనుగందుల శ్రీనివాస్, జి.తిరుపతి నాయక్, జిందం లక్ష్మీనారాయణ, అందె వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



