ముస్లింలు ఇఫ్తార్ విందులతో సరి పెట్టుకోవాలా?
ఇఫ్తార్ విందులకు మురిసిపోకండి, హక్కుల కోసం పోరాడండి- మొహమ్మద్ ముజాహిద్

viswatelangana.com
ఇఫ్తార్ విందులకే పరిమితం కాకండి, ముస్లింలు తమ హక్కుల కోసం పోరాడాలి అని యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్ అన్నారు. ముస్లింల కోసం ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, కేవలం 3,003 కోట్లు మాత్రమే కేటాయించడంతో పాటు, అందులోనూ ఒక్క వెయ్యి కోట్లు కూడా మైనార్టీలపై ఖర్చు చేయలేదు. 16 నెలలు గడిచినా మైనారిటీల కోసం చేసిందేమీ లేదు. ఒక్క మైనారిటీ లోన్ కూడా ఇప్పటివరకు మంజూరు చేయలేదు. మాటలకే పరిమితమై, ముస్లింల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం లేదు” అని ముజాహిద్ తీవ్రంగా విమర్శించారు. ప్రతి ఏడాది ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తోందని, కానీ అసలు సమస్యలు పరిష్కరించకుండా ముస్లింలను తాత్కాలికంగా మురిపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మన బిక్ష కాదు, హక్కు క్యాబినెట్లో ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని, మంత్రి పదవిని కేటాయించాలని డిమాండ్ చేయండి అని ముజాహిద్ పిలుపునిచ్చారు. ముస్లింలు విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం సమగ్రంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఇఫ్తార్ విందులతోనే సరిపెట్టుకునే పరిస్థితిని తప్పుడు రాజకీయ వ్యూహంగా ముస్లింలు అర్థం చేసుకోవాలి అని ఆయన హెచ్చరించారు.



