రాయికల్

ఇన్స్పైర్ అవార్డులలో రాష్ట్రస్థాయికి ఎంపికైన ఇటిక్యాల విద్యార్థిని…

viswatelangana.com

December 9th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ఇన్స్పైర్ మానక్ 2023-24 అవార్డుల జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రోగ్రాం ఆరు, ఏడవ తేదీలలో జగిత్యాల లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన భేతి రశ్మిత ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమల దారి సదాశివ్ పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం బేటి రశ్మితను, గైడ్ టీచర్ ముక్కెర శేఖర్, గాజెంగి రాజేశం లను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఇటిక్యాల గ్రామ తాజా మాజీ సర్పంచ్ సామల వేణు, ఎంపీటీసీ కొమ్ముల ఆది రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తాలుక లావణ్య, ప్రముఖ సామాజిక వేత్త మాజి ఎంపిపి కాటి పెల్లి గంగారెడ్డి, విడిసి చైర్మన్ గంగాయాదవ్, మాజీ సర్పంచ్ నీరటి శ్రీనివాస్, కంటె విష్ణు లు కూడా విద్యార్థిని ని, గైడ్ టీచర్ ను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ విషయాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందు ముందు మరిన్ని విజయాలను సాధించాలని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాజంగి రాజేశం, టి.వై.ఎం.ఎస్.ఈ.యు రాష్ట్ర శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, హనుమంతరావు, జియావుద్దీన్ ఎద్దండి రమేష్ రెడ్డి, స్వర్ణలత శ్రీలత నీరజ ముజాహిద్ నాగలక్ష్మి , లింగయ్య విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button