
viswatelangana.com
కమ్మరిపేట రైతుల సహకారంతో, గ్రామ ప్రజల దీవెనలతో మేడిపల్లి మండల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా తనకు అవకాశం లభించిందని కమ్మరిపేట రైతుల దీవెనలు, సహకారం ఎప్పటికీ మరువలేనని మేడిపల్లి మండల తాజా మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉదిగిరి రమ్య- ఆదిరెడ్డి అన్నారు. సోమవారం రోజున భీమారం మండలంలోని కమ్మరిపేట గ్రామంలో రైతు సంఘం నాయకులను మేడిపల్లి తాజా మాజీ చైర్పర్సన్ ఉదిగిరి రమ్య – ఆదిరెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిసి రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తదనంతరం రైతు కండువాలు కప్పి వారిని ఘనంగా సన్మానించారు. ఈరోజు మేడిపల్లి మండల వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుదైన గౌరవాన్ని తమకు దక్కేల చేసిన కమ్మరిపేట రైతులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మీ సహకారం ఎప్పటికి మరువలేనిది అన్నారు. ఎల్లవేళలా కమ్మరిపేట రైతులకు, ప్రజలకు వారి సహకారాలు ఉంటాయని మున్ముందు కూడా కమ్మరిపేట రైతులు, ప్రజల సహకారం, దీవెనలు, వారిపై ఇలాగే ఉంచాలని వారు కోరారు. ముందు ముందు కూడా గ్రామానికి, మండలానికి సేవ చేసే అవకాశాల్ని ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో బాగంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీ ఆర్ ఎస్ అభ్యర్థి అయిన బోయినపల్లి వినోద్ కుమార్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దెతున రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు.



