మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ పై ఫిర్యాదు..
viswatelangana.com
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ పై మంగళవారం రోజున ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతం పేరు సెంటిమెంట్ ను వాడుకుని గెలిచిన మీరు గడచిన ఐదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి కొత్తగా చేసిందేమిటి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గతంలో మా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎంతో కష్టపడ్డారు పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడి పెప్పర్ స్ప్రే దాడిని సైతం తట్టుకొని తెలంగాణ బిల్లు పాస్ అయ్యేలా చేసిన ఘనుడు అట్లాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే మీరు సంస్కారహీనులని తెలుస్తుంది అన్నారు.కేవలం మతం నీ అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే మీలాంటి దుష్టులను ప్రతి ఒక్క ఓటరు రాముడు అవతారం ఎత్తి వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్న ఇకనైనా ఇట్లాంటి భాషను మానుకొని పద్ధతిగా ప్రవర్తించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి, భీమారం మండలాల అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి సింగిరెడ్డి నరేష్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు,వివిధ హోదాలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



