మేడిపల్లి

మేడిపల్లి బస్టాండ్ లోకి బస్సు రావాలి అన్ని బస్సులు ఆగాలి

viswatelangana.com

May 27th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం( గ్రామానికి) రోడ్డుకు ఇరువైపులా రాజలింగంపేట్ గోవిందారం భీమారం రంగాపూర్ కొండాపూర్ మేడిపల్లి రోడ్డుకు ఆవైపున పోరుమళ్ళ తొంబరావుపేట, కట్లకుంట ఈ విధంగా పలు గ్రామాలకు మేడిపల్లి గ్రామం కేంద్ర బిందువుగా ఉండడం జరిగింది. మేడిపల్లి గ్రామం రెండువైపుల గ్రామ ప్రజలు ఏ ప్రాంతానికి వెళ్లాలన్న మేడిపల్లి కి రావాల్సిందే అక్కడినుండి వారు వెళ్లవలసిన ప్రదేశాలకు వెళ్లడం జరుగుతుంది . కానీ మేడిపల్లిలో నామమాత్రంగా మాత్రమే బస్ స్టేషన్ ఉండడం జరిగింది. బస్టాండ్ లోకి బస్సులు రావు, ఇటు కరీంనగర్ అటు నిజామాబాద్ వెళ్లవలసిన ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్ స్టాప్ కూడా ఉంది. బస్టాండ్ లోకి వెళ్లకుండా మెయిన్ రోడ్డు పైనే ఆపడం జరుగుతుంది. మరికొన్నిసార్లు ప్రయాణికులు ఉన్నాగాని బస్సులు ఆపకుండా వెళ్లడం జరుగుతుంది. ప్రయాణికులు ఎండాకాలం ఎండలో వర్షాకాలం వానలో రోడ్డుపై బస్సుల కొరకు పడిగాపులు కాయల్సి వస్తుంది అని చాలా ఇబ్బందికరంగా ఉంది అని ఈ యొక్క సమస్యను సంబంధిత అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మేడిపల్లి మండల గ్రామాల ప్రజలు కోరడం జరిగింది.

Related Articles

Back to top button