రాయికల్
పోలింగ్ స్టేషన్ సమీపంలో అనుమానితుల హల్చల్

viswatelangana.com
May 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బాలికల పాఠశాల వద్ద గల పోలింగ్ స్టేషన్లకు వెళ్లేదారిలో అనుమానితులు హల్చల్ చేశారు దాదాపు 30 మంది బ్యాగ్ వేసుకొని వచ్చిన యవతులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా జర్నలిస్టులు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా వెనుతిరిగారు, ఇట్టి విషయం పోలీసు శాఖ దృష్టికి తీసుకు వెళ్లగా వారిని బస్సులో పంపించారు, కానీ ఇంతమంది ఎందుకు వచ్చారు దొంగ ఓట్లు వేసే తందుకే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి పోలీస్ శాఖ వారిని అదుపులోకి తీసుకొని తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా వెనుకకు పంపడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నట్లు పలు పార్టీల నాయకులు అభిప్రాయ వ్యక్తం చేశారు



