రాయికల్

మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

viswatelangana.com

September 18th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయికల్ మండల మహేంద్ర మేదరిసంఘం ఆధ్వర్యంలో భరతమాత విగ్రహం నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎమ్మార్వో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రకృతి సిద్ధంగా లభించే వెదురుతో పనిముట్లు తయారు చేస్తూజీవనం కొనసాగించే మేదరి కులస్తులము ఇతర రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ జాబితాలో ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం బి సి ఏ జాబితాలో ఉన్నది అట్టి దానిని ఎస్టీ జాబితాలో చేర్చాలి మేదర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఇందూరి గంగాధర్ సలహాదారు గైని లచ్చన్న. రాయికల్ మండల అధ్యక్షులు సిలివేరి సురేష్ రాయికల్ పట్టణ సంఘం అధ్యక్షులు ఊరేడి లక్ష్మీ నరసయ్య ఇందూరి రాజు ఊరెడి గంగాధర్ చిలువేరు చిన్నరాజు శనిగరపు రాజ నరసయ్య చంద రాజ నరసయ్య మహిళా సంఘం అధ్యక్షురాలు కనికరం రాజమణి జమున లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button