viswatelangana.com
Date of Publish : 29 April 2025, 3:15 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మే 1వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరం

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణలో భాగంగా రాష్ట్ర యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహించునట్లు కోచ్ ముద్దం ప్రవీణ్ తెలిపారు. స్థానిక స్కూల్లో ఉచితంగా వాలీబాల్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని 14 సం.లలోపు బాలబాలికలు వినియోగించుకోవాలన్నారు. వివరాలకు నంబర్ 97017 10968 సంప్రదించాలన్నారు

Change News Type