రాయికల్
మోడల్ స్కూల్లో కంటి వైద్య శిబిరం

viswatelangana.com
March 11th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల మోడల్ స్కూల్లో ఆర్ బి ఎస్ కే మరియు జిల్లా అందత్వ నివారణ సమితి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 17 మందికి వక్రీభవన సమస్య ఉండడం వలన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కే డాక్టర్ కే రేవతి, డాక్టర్ నరేంద్ర, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఏఎన్ఎం జ్యోతి, భాగ్య లక్ష్మి,వనిత, రజిత, ఫార్మసిస్ట్ గౌతమి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



