viswatelangana.com
Date of Publish : 31 August 2024, 3:35 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… స్కూల్ వెళ్లే దారిలో రెండు రోడ్లు తెగిపోయినందున ముందుగా ఒక రోడ్డు నిర్మాణం కోసం ప్రణాళికలను సిద్ధం చేసి ఈ.జీ.ఎస్ కింద నిధులను మంజూరు చేసి త్వరలోనే పని పూర్తి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం నివేదికలు తయారుచేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లను శానిటేషన్ చేయించాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని ప్రిన్సిపాల్ ని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ రఘువరన్, ఎమ్మార్వో, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Change News Type