కొడిమ్యాల
మోడల్ స్కూల్ ను సందర్శించిన ప్యానల్ టీం

viswatelangana.com
January 24th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శుక్రవారం జనవరి 24 ప్రభుత్వ మాడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో శుక్రవారం పానల్ టీం సందర్శించింది. మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల బోధన తీరు, పాఠశాల నిర్వ హణ, పాఠశాలల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ వంటి పలు అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో క్రీడా పోటీల నిర్వహణను, బ్యూటేసియన్, అగ్రికల్చర్ ఒకేషనల్ విద్యా విధానంలోని ప్రాజెక్టులను భోధన పని తీరును పరిశీలించారు. ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థుల సంఖ్యను పెంచవలసిన అవసరం బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లు బి లావణ్య, నాగ సుధారాణి, ఆదిత్య, సంతోష్, కృష్ణ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి మరియు ఉపాద్యాయ బృందం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.



