అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు..
viswatelangana.com
- కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్.
వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, యాసంగి పంటకు ఏఫ్రీల్, మే మాసాల్లో 500ల రూపాయల బోనస్ ఇవ్వాలని, ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని, ఆచరణకు సాధ్యం కాని అమలు కానీ హామీలు ఇచ్చి ఓట్లు దండుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందని వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పినారని పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగానే ఆరు గ్యారెంటీల అమలుకు ఈ రెండు,మూడు రోజుల్లోనే జీవోలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం రోజున జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పొరుమల్ల గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో సంతకాలు చేసిన పత్రాలను ప్రజల దగ్గరకు ఇంటింటికి తీసుకెళ్లారని ఇప్పటి వరకు ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఒక్క హామీలో ఉచిత బస్సు ప్రయాణం 33శాతం మాత్రమే పూర్తి అయిందని,అందులో ఇంకా 67శాతం మిగిలే ఉందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో మూడు ఉప గ్యారెంటీలు ఉన్నాయని 500లకే సిలిండర్, ప్రతి మహిళలకు 2500 పెన్షన్ వంటి హామీలు ఉన్నాయని తెలిపారు.వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నోరుమెదపడం లేదని పేర్కొన్నారు. వారం పది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని, ఎన్నికల కోడ్ ఉందనే సాకుతో తప్పించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కారు చేసే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల్లోనే 200ల యూనిట్ల కరెంటు, 500లకే సిలిండర్ వంటి హామీలు అమలు చేస్తామని పత్రికలలో వచ్చిన వార్తా కథనాలు చూడటం జరిగిందని, ఒకవేళ ఇవి రెండూ అమలు చేస్తే మిగతా హామీలకు కూడా వెంటనే జీవోలు విడుదల చేయాలని కోరారు.ప్రతి క్వింటాలుకు 500ల బోనస్ ఇస్తామని చెప్పారని, కానీ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరామ్ రెడ్డి ఇప్పుడు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర వస్తేనే బోనస్ ఇస్తామని మాట్లాడుతున్నారని ఇప్పుడు ఎక్కడ కూడా కనీస మద్దతు ధర కంటే రైతులు ధాన్యం విక్రయించడం లేదన్నారు. తెలంగాణ రైతాంగానికి ఎఫ్రీల్, మే మాసాల్లో ప్రభుత్వం రైతులకు క్వింటాలుకు 500ల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.కల్యాణ లక్ష్మీ ద్వారా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని అన్నారు.ప్రతి మహిళకు 2500రూపాయలు, వృద్ధులు,వితంతువులు, ఒంటరి మహిళలకు 2016 రూపాయలు ఉన్న పెన్షన్ ను 4000 రూపాయలకు పెంచాలని, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, జడ్పీ వైస్ చైర్మన్ హారిచరణ్ రావు, కథలాపూర్ మండల జడ్పీటీసీ నాగం భూమయ్య,ఎంపీపీ ఉమాదేవి – రమాకాంతరావు,టిటిడిసి బ్యాంక్ డైరెక్టర్ మిట్టపల్లి రమేష్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తిరెడ్డి, ఎంపీటీసీ వినోద -సాగర్, జక్కుల నాగరాజు యాదవ్, దూలం సంపత్, ద్యావ మధుసూదన్ రెడ్డి, లక్ష్మణ్, మేడిపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అజీమ్, యువ నాయకుడు పెద్దిరెడ్డి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.



