రాయికల్

యాదవులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి.

viswatelangana.com

April 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
  • రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం.
  • యాదవ సంఘం మండల అధ్యక్షులు వాసరి రవి యాదవ్.

యాదవులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని యాదవ సంఘం మండల అధ్యక్షులు వాసరి రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి లాల్చావుల రాజేష్ యాదవ్ అన్నారు. రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన భూషణ వేణి శ్రీనివాస్ యాదవ్, లలిత ల కుమార్తె భూషణ వేణి వైష్ణవి స్థానిక మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసించి ఎంపీసీ లో1000 మార్కులకు గాను 983 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. దీనికి గాను మధ్య తరగతి కుటుంబం లో పుట్టి ఇటిక్యాల ప్రభుత్వ ఆదర్శ(మోడల్)పాటశాలలో విద్యనభ్యసించి గ్రామ, మండల, జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో ఇనుమడింప చేసిన వైష్ణవి నీ రాయికల్ మండల యాదవ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం భగవద్గీతను అందజేసి విద్యార్థినీ నీ అభినందించారు. విద్యార్థినిని ప్రోత్సహించిన తల్లితండ్రులను, ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుండి ప్రభుత్వ విద్యా సంస్థలో చదివి రాష్ట్ర స్థాయిలో విద్యార్థిని రాణించడం శుభ పరిణామం అని, విద్యార్థులు, యువకులు ఆమెను ఆదర్శంగా తీసుకోనీ మంచి ఉన్నత హోదాలు పొందాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో యాదవ ఉద్యోగ సంఘ రాష్ట్ర నాయకులు వేల్పుల స్వామి యాదవ్, మండల నాయకులు ఆసరి మల్లేష్ యాదవ్, గడ్డం మల్లారెడ్డి యాదవ్, బుసనవెని శ్రీనివాస్ యాదవ్, బుసనవెని రమేష్ యాదవ్, బుసనవెని గంగరాజం, కొక్కెర చంద్ర శేఖర్ యాదవ్, నల్ల గంగా రెడ్డి యాదవ్, కొక్కెర రాజు యాదవ్, నేతుల రాజేందర్ యాదవ్, ముక్కెర బీమయ్య యాదవ్, ఉపాధ్యాయులు ఏద్ధండి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button