
viswatelangana.com
పల్లె పల్లెనా యాదవులను చైతన్యం చేసి ప్రభుత్వాల పరంగా యాదవులకు రావాల్సిన ప్రాధాన్యతను హక్కులను సాధించుకుని జగిత్యాల జిల్లాలో యాదవుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు.. శుక్రవారం కథలాపూర్ మండలంలోని పోతారం గ్రామంలో గ్రామ యాదవ సంఘ సమావేశాన్ని నిర్వహించి సభత్వాలతో సంఘ బలోపేతం, యాదవులకు జరుగుతున్న అన్యాయాల పై చర్చించి సమస్యల పరిష్కారం హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు.. అనంతరం సభ్యత్వం తీసుకున్న పోతారం గ్రామ యాదవ సంఘ సభ్యులకు యాదవ సంఘం అడహాక్ కమిటీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల ఇంచార్జి లు మ్యాదరవేణి రామాంజనేయులు యాదవ్, రాచర్ల రవి యాదవ్, బర్ల మధు యాదవ్, మార్కం రాజేశం యాదవ్, గంగుల రాజేందర్ యాదవ్, కల్లూరి రమేష్ యాదవ్, మట్ట గజపు నర్సయ్య యాదవ్ లతో కలిసి సభ్యత్వ రసీదులను అందించిన జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్. ఈ కార్యక్రమంలో.. సంఘ సభ్యులు కల్లూరి మల్లేష్ యాదవ్, రాగుల సాయన్న యాదవ్, తాలూక మల్లేష్ యాదవ్, కల్లూరి రాజేందర్ యాదవ్, గొర్ల రమేష్ యాదవ్, పిల్లి మల్లయ్య యాదవ్, గెల్లె రాజ మల్లయ్య యాదవ్, నవనీత్ యాదవ్, రాజేందర్ యాదవ్ దండికే నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..



