
viswatelangana.com
ఈనెల 30వ తారీకు రోజున హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాదవుల ఆత్మ గౌరవ సభ ను విజయవంతం చేయాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్, జర్నలిస్ట్ పోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ యాదవ్ అన్నారు.. సోమవారం యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అధ్యక్షతన కోరుట్ల పట్టణ కేంద్రంలో యాదవ సంఘ సమావేశం మరియు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.. ఈ సందర్బంగా రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ యాదవులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని, జనాభా ప్రాతిపదికన యాదవులకు నామీనేటెడ్ పదవులలో యాదవులకు స్థానం కల్పించాలని, పదివేల కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని,స్థానిక సంస్థల ఎన్నికలలో, విద్యా ఉద్యోగ రంగాలలో బీసీలకు 42% రిజర్వేషన్ లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్, జిల్లా ముఖ్య నాయకులు, తొట్ల చిన్నయ్య, మ్యాదరవేని రామాంజనేయులు, తిప్పన వేని రవి, అంకం శంకర్, గుండెల నాగేష్, ముక్కెర లింబాద్రి, జాల వినోద్, అరికంటి సాగర్, జాల చిన్న మొండయ్యా, ముక్కెర రాజగంగారాం, అలిశెట్టి భుచ్చి రాములు, అంజయ్య, మహేష్, గడేలా ప్రకాష్, అసరి అంజయ్య, దానవేణి సంజీవ్, డబుల్ మల్లేష్, అలిశెట్టి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు..



