యాదవుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుదాం-గనవేని మల్లేష్ యాదవ్

viswatelangana.com
జగిత్యాల జిల్లాలో యాదవుల సంక్షేమమే లక్ష్యంగా యాదవులందరం ముందుకు సాగుదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..మెట్ పల్లిమండలం కొండ్రీకర్ల గ్రామంలో జిల్లా సలహాదారులు తొట్ల చిన్నయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ యాదవ సంఘ సమావేశాన్ని నిర్వహించి సభ్యత్వ నమోదు ద్వార సంఘ బలోపేతం, గ్రామాలలో యాదవులకు జరుగుతున్న అన్యాయాలు, సమస్యల పరిష్కారం, హక్కుల సాధన గురించి చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం సంఘ సభ్యులు మొత్తం 45 మంది సభ్యత్వం తీసుకోగ వారికి మండల ఇంచార్జిలు అంకం శంకర్ యాదవ్, లక్కం మహిపాల్ యాదవ్, వేల్పుల అంజయ్య యాదవ్ లతో కలిసి సభ్యత్వ రసీదులందించి అనంతరం గంట రాజేశ్వర్ యాదవ్ మండల ఇంచార్జి గా ప్రకటించిన జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ ఈ కార్యక్రమంలో.. గ్రామ యాదవ సంఘ సభ్యులు.. చెన్నవేని తిరుపతి యాదవ్, చిన్నయ్య యాదవ్, గొర్ర రాజశేఖర్ యాదవ్, కసాడి పెద్ద అంజయ్య యాదవ్, దేవానందం యాదవ్, గంట రాజారెడ్డి యాదవ్, రవీందర్ యాదవ్, రాజేందర్ యాదవ్, రవి యాదవ్ రంజిత్ యాదవ్, భైర హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..



