జగిత్యాల

పిసిసి పిలుపుమేరకు ధర్నాలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

February 3rd, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించిన బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విప్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ధర్నాలొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు కోట్ల రూపాయల అప్పు చేసిందని అయినా ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చేయి చూపించిందని జువ్వాడి కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులతో పాటు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణరావుతో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు వెంకటేశం గౌడ్,లక్ష్మీనారాయణ, నాయీమ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button