యాదవ్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

viswatelangana.com
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉంది హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ , రాయికల్ పట్టణ శ్రీకృష్ణ యాదవ సేవ సంఘం మరియు రాయికల్ యాదవ సంఘం సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.సంఘ సభ్యులు కాసావేని రాజేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాదవ్ కులస్తులకు ఎలాంటి గుర్తింపు తేలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజాపాలన దిశగా అన్ని వర్గాలు సంక్షేమం గూర్చి ఆలోచించి ప్రత్యేక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన భాగంలో యాదవ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రాయికల్ మండల మరియు పట్టణ యాదవ కులస్తులు మరియు సంఘ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జక్కుల స్వామీ, కాసావేని రాజేష్, దనవేని పెద్ద మల్లయ్య, కాసావేని మల్లకార్జున్, ఎర్ర మల్లయ్య, మహేష్, వెంకటేష్, మల్లేష్, నడిపి మల్లయ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు



