కథలాపూర్
యువజన కాంగ్రెస్ మండల అధ్యక్ష బరిలో అర్జున్ గౌడ్

viswatelangana.com
August 7th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
నాయకులు తమకు అండగా ఉండి గెలుపునకు సహకరించాలని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొమ్మటి అర్జున్ అన్నారు. ఈ సందర్భంగా అర్జున్ బుధవారం మాట్లాడుతూ కథలాపూర్ మండల యువజన అధ్యక్షుడిగా బరిలో ఉన్న సందర్భంగా 18 నుండి 35 సంవత్సరాల వారి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభంకానున్న యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీచేయడం జరుగుతుందని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు నుంచి అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ కోసం అనేక సంవత్సరాలు నిరంతరం కష్టపడ్డానని వివరించారు. పార్టీ విధివిధానాలు తూచ తప్పకుండా క్రమశిక్షణ కలిగి ఉన్నానని అన్నారు. ఈసారి నన్ను యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించి మనస్ఫూర్తిగా గెలిపించాలని అర్జున్ కోరారు.



