కొడిమ్యాల
రైతు నేస్తం వేదికలో వీడియో కాన్ఫరెన్స్ శాస్త్రవేత్తలుతో

viswatelangana.com
June 10th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోనిపూడూరు గ్రామ. రైతు వేదిక లో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. కూరగాయల సాగు, పశు పోషణ, వానకాలంలో పశువులలో వచ్చే రోగాల పైన అవగాహన కల్పించడం జరిగింది. పూడూరు రైతు రాoరెడ్డి టమాటా పంట లో సూది పురుగు నివారణ గురించి తెలుసుకొని సందేహాలు నివృత్తి చేసుకున్నారు. మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నేరుగా శాస్త్రవేత్తలతో అడిగి తెలుసుకునే అవకాశం కలదు.దీనిలో మండల వ్యవసాయ అధికారి పి.జ్యోతి, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీలత,గ్రీష్మ, రైతులు పాల్గొన్నారు.



