కోరుట్ల

యోగాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి

viswatelangana.com

October 7th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

గత మూడు రోజుల క్రితం హైదరాబాదు నగరంలో జరిగిన ఐదు రాష్ట్రాల యోగ విన్యాసాల పోటీలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రాంతానికి చెందిన సామల సత్యం-వసుంధర కుమారుడు నవనీత్ కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో గల ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఐదవ తరగతి నుండి యోగా శిక్షణ పొంది అనేక యోగ ఆసనాలు వేసి అందరి మన్నానలను పొందాడు. తాజాగా ఐదు రాష్ట్రాల యోగ పోటీలు హైదరాబాదులో నిర్వహించగా నవనీత్ ఆయన ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా ప్రశంస పత్రాన్ని అందజేశారు. నవనీత్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలోని యోగా గురువు అజయ్, ప్రిన్సిపాల్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు నవనీత్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

Back to top button